కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు నమోదైంది. ఈ నెల ఆరో తేదీన మహారాష్ట్రలో నిర్వహించిన ఓ ర్యాలీలో మహాత్మాగాంధీని హతమార్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విధానాలేనని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. దీనిపై ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఓ కేసు నమోదైంది.

న్యాయవాది, పీపుల్ ఫర్ లీగల్ ఎయిడ్ సొసైటీ కన్వీనర్ అయిన సాను శుక్లా ఈ కేసు దాఖలు చేశారు. మహాత్మాగాంధీ హత్యలో సంఘ్ కు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పాత్ర లేదని నిఘా సంస్థలతో పాటు కపూర్ కమిషన్ కూడా క్లీన్ చిట్ ఇచ్చాయని శుక్లా అన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు కేవలం తనను బాధించడమే కాక, పూర్తిగా వాస్తవ విరుద్ధాలని ఆయన చెప్పారు. సంఘ్ పరివార్ పరువు ప్రతిష్ఠలకు తీవ్ర భంగకరమని కూడా శుక్లా అభిప్రాయపడ్డారు.

More Telugu News