Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుటుంబ పాలన నడపాలని కేసీఆర్ చూస్తున్నారు: మంద కృష్ణ

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ విమర్శలు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ లో మాట్లాడిన ఆయన, తెలంగాణలో కుటుంబ పాలన నడపాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ తో సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు.

More Telugu News