నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. నేడు జరిగే ప్రధమ సంవత్సరం పరీక్షకు సెట్ నెంబరు 1 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. తొలిసారిగా ఇంటర్ బోర్డు 'నిమిషం ఆలస్యం' నిబంధనను అమలుచేస్తోంది. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో మాస్ కాపీయింగ్ నిరోధానికి తొలిసారి పరీక్షా కేంద్రాలపై నిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,78,379 మంది విద్యార్ధులు హాజరుకానున్న ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభంకానుంది.