ఆర్ఎల్డీలో చేరిన జయప్రద, అమర్ సింగ్
రాజకీయ మంత్రాంగాల్లో పేరొందిన ఎస్పీ మాజీ నేత, ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమర్ సింగ్, ఆయనకు అత్యంత సన్నిహితురాలు, మాజీ నటి జయప్రద అజిత్ సింగ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)లో ఈ రోజు చేరారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అజిత్ సింగ్ కు మంచి పట్టుంది. అమర్ సింగ్ ను ఫతేపూర్ సిక్రి లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపవచ్చని సమాచారం. జయప్రదకు ఏ స్థానం కేటాయించేదీ స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఆర్ఎల్డీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆర్ఎల్డీకి 8 స్థానాలు దక్కాయి. అందులోనే వీరిద్దరికీ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది.
అమర్ సింగ్, జయప్రద ను ఎస్పీ 2010 ఫిబ్రవరిలో పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత జయప్రద కొంత కాలంపాటు మన రాష్ట్రంలో తిరిగారు. త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నానని, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి అనేది తర్వాత వెల్లడిస్తానని చెప్పిన ఆమె రాష్ట్రాన్ని వీడారు. అమర్ సింగ్ కు, జయప్రదకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. దీంతో చివరికి ఆయనతో కలసి మరో ఉత్తరాది పార్టీని ఆశ్రయించడం ద్వారా జయప్రద తెలుగు ప్రజలకు దూరంగా వెళ్లారు.