రుమేనియన్ బ్యూటీని పెళ్లాడనున్న సల్మాన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రుమేనియన్ బ్యూటీని పెళ్లాడనున్న సల్మాన్!

బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ రొమాంటిక్ హీరో సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. దీంతో గత కొంత కాలంగా తాను డేటింగ్ చేస్తున్న రుమేనియా అందం 'లులియా వాంటర్'ని సల్మాన్ పెళ్లాడబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. రెండున్నరేళ్లుగా తన జీవితంలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోందని... ఇకపై అలా ఉండదని నిన్న జరిగిన ఇండియా టుడే సదస్సులో చెప్పాడు. తన జీవితంలో ఓ కీలక ఘట్టం జరగబోతోందని స్పష్టం చేశాడు. దీనికితోడు, "నా తండ్రి పఠాన్, అమ్మ హిందూ, రెండో అమ్మ కేథలిక్, బావ పంజాబీ... నా భార్య విదేశాల నుంచి వస్తుందేమో" అంటూ హింట్ ఇచ్చాడు. తాను కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వనని... మానవత్వాన్ని మాత్రమే పట్టించుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో త్వరలోనే సల్మాన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

More Telugu News