సచిన్ కెరీర్ పై ఊహాగానాలొద్దు: ధోనీ
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ పై ఊహాగానాలకు స్వస్తి పలకాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాకు హితవు పలికాడు. ఆసీస్ తో చివరి టెస్టు అనంతరం సచిన్ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడంటూ మీడియాలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా, సచిన్ సోదరుడు అజిత్ ఈ మ్యాచ్ కు హాజరవడం ఈ విషయాన్ని మరింత బలపరిచింది కూడా.
దాంతోపాటు, సచిన్ బ్యాటింగ్ కు వస్తున్నపుడు, అవుటై పెవిలియన్ కు మరలినపుడు ప్రేక్షకులు సీట్లలోంచి లేచి నిలబడి కరతాళధ్వనులతో హోరెత్తించడం.. మాస్టర్ రిటైర్మెంటుపై ఊహాగానాలకు మరింత ఊపిర్లూదింది. అయితే, మీడియా వార్తలను ధోనీ కొట్టిపారేశాడు. ఢిల్లీ టెస్టు ముగిసిన అనంతరం మీడియానుద్ధేశించి మాట్లాడుతూ '2005లో కూడా ఓసారి సచిన్ రిటైరవబోతున్నాడని మీరు ప్రచారం చేశారు. అయినా అలా జరగలేదే' అని వ్యాఖ్యానించాడు.