జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్

రాష్ట్రంలో ఎన్నికల కాలం నడుస్తోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలకూ నగారా మోగగా, తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాగా, ఏప్రిల్ 6న ఈ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఏప్రిల్ 8 లేదా 9న కౌంటింగ్ ఉండొచ్చని సమాచారం.

More Telugu News