Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ అనుబంధం అందంగా ఉండాలి: దీపికా పదుకునే

'ఎవరితోనైనా అనుబంధం పెంచుకోవడం చాలా ముఖ్యం. నాలాగే ఇతర మహిళలూ ఆలోచిస్తారని అనిపిస్తుంది. అయితే ఆ అనుబంధం మనోహరంగా ఉండాలి. ప్రేమలో పడ్డ ఇద్దరికీ మేలు చేసేలా ఉండాలి. బాధపెట్టేలా ఉండకూడదు' అని బాలీవుడ్ పొడగుకాళ్ల సుందరి దీపికా పదుకునే తెలిపారు. సహనటులతో ప్రేమలో పడిందంటూ చాలాసార్లు వార్తలు వచ్చినా ఆమె బహిరంగంగా ఎప్పుడూ వాటిపై పెదవి విప్పలేదు. ప్రేమ సంబంధాలపై తన అభిప్రాయాన్ని మాత్రం వివరించింది. ఎవరితోనైనా అనుబంధం పెంచుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని, మనసు చెప్పినట్టే నడుచుకోవడం తన పద్ధతని తెలిపింది.

'సినిమాలు ఎంచుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తాను. మనసుకు నచ్చిన ప్రాజెక్టుపైనే సంతకం చేస్తాను. విజయానికి ఇది ఉత్తమ మార్గం అని నేను అనుకుంటాను. స్క్రిప్టుల ఎంపిక కోసం ప్రత్యేక విధానమంటూ నాకు లేదు’ అని వివరించింది. రామ్‌లీలా కథానాయకుడు రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం గురించి ప్రస్తావించినప్పుడు స్పందిస్తూ, ఇప్పుడు అలాంటి విషయాల జోలికి వెళ్లదల్చుకోలేదని చెప్పింది. ఏ వ్యక్తి గురించి అయినా పూర్తిగా తెలుసుకున్నాకే అతనితో అనుబంధం పెంచుకోవాలన్న విషయాన్ని అనుభవాలతో గ్రహించానని తెలిపింది.

More Telugu News