తెలంగాణ పీసీసీ రేసులో లేను: జైపాల్ రెడ్డి
మరో రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షులను ఖరారు చేయనున్న తరుణంలో జైపాల్ రెడ్డి పెదవి విప్పారు. తెలంగాణ పీసీసీ రేసులో తాను లేనని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిపారు. టీఆర్ఎస్ తో పొత్తు అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.