Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత పురుషుల తీరు మరీ దారుణం

బాధ్యతలు నెత్తినేసుకుని పురుషులకు నొప్పి తెలియకుండా 'ఆమె' నెట్టుకొస్తున్న వైనం తెలిసిందే. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు 'ఆమె'కు విశ్రాంతి ఉండదు. ఇంటి పని, వంట పని, పిల్లలు, భర్త... అందరికీ, అన్నింటికీ 'ఆమె' కావాల్సిందే. ఇలా నిర్విరామంగా ఇల్లు చక్కదిద్దే ఇల్లాలికి భారత పురుషులు ఎంత సమయం సహాయపడతారో తెలుసా...? కేవలం 19 నిమిషాలేనట! ఈ కాస్త సమయం వారు ఏదో వంట పనిలోనో, ఇల్లు సర్దడంలోనో తమ భార్యలకు ఆసరాగా ఉంటారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) తెలిపింది.

గృహ సంబంధ దైనందన కార్యక్రమాల్లో మన మగ మహారాజుల తీరు ఇంత దారుణంగా ఉందని ఓఈసీడీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. నిజంగా చింతించాల్సిన విషయమే కదూ? అన్ని విషయాల్లో వలే చైనా ఈ అంశంలోనూ మన కంటే మెరుగ్గా ఉంది. చైనా పురుషులు ఇంటి పనికి సగటున 48 నిమిషాలు కేటాయిస్తారట. జపనీస్ 24 నిమిషాలు, కొరియన్లు 21 నిమిషాలతో మన మగాళ్ళ కంటే ముందున్నారు.

More Telugu News