జానారెడ్డి నివాసంలో టీకాంగ్రెస్ నేతల భేటీ
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో టీకాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలు, టీఆర్ఎస్ వ్యవహారశైలిపైన వీరు ప్రధానంగా చర్చిస్తున్నారు. పొత్తులంటూనే అభ్యర్థులను ప్రకటించడంపై టీకాంగ్ నేతలు టీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు లేకపోవడమే మేలని దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పొత్తు ఉంటేనే మేలని ఉత్తర తెలంగాణ నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.