Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ ప్రజాదరణ ఉన్న వ్యక్తి : సీపీఐ నారాయణ

సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెడుతారనే వార్తలను తాను కూడా విన్నానని ఆయన అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వల్ల ప్రజలు చైతన్యవంతులవుతారంటే, పవన్ కల్యాణ్ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై ఇంకా ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని నారాయణ తెలిపారు.

More Telugu News