Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా జానారెడ్డి?

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి పీసీసీ అధ్యక్షుడిగా జానారెడ్డి నియామకం దాదాపు ఖరారయింది. ఈ సాయంత్రం కాని, రేపు ఉదయం కాని అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. అయితే టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం డీఎస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్ పేర్లను కూడా పరిశీలించారు. వీరంతా కూడా చివరి క్షణం వరకు తమ తమ ప్రయత్నాలను కూడా కొనసాగించారు. వీరితో పాటు మైనార్టీ అభ్యర్థిగా షబ్బీర్ అలీ పేరును కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికన్నా జానారెడ్డే సరైన అభ్యర్థిగా హైకమాండ్ భావిస్తోంది. అందరినీ కలుపుకుని పోగల సత్తా జానారెడ్డికే ఉందనేది ఢిల్లీ పెద్దల భావన. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా జానారెడ్డి నియామకం దాదాపు ఖరారయినట్టే.

More Telugu News