డూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కు చెందిన ఓ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న 26 ఏళ్ల అరవింద్ మిశ్రా ఏకధాటిగా అత్యధిక సమయం బోధించిన గురువుగా రికార్డు సృష్టించారు. మెకానికల్ ఇంజనీరింగ్ బోధించే మిశ్రా ఏకధాటిగా 130 గంటలకు పైగా ఉపన్యాసం ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు పోలెండ్ కు చెందిన ఎడ్వర్డ్ ముజవాజి పేరిట ఉంది. 2009లో ఈయన 121 గంటలపాటు బోధించాడు.

More Telugu News