పదవ తరగతి పాఠంగా 'మాయా బజార్'!
తెలుగు సినీ రంగంలో 'మాయా బజార్' ఓ కళాఖండం. కేవీ రెడ్డి దర్శత్వంలో విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన... ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు, గుమ్మడి, సావిత్రి, పలువురు నటించిన పౌరాణిక చిత్రం. ఎన్నేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనిది. ఇప్పుడీ కళాఖండం గొప్పదనాన్ని భవిష్యత్ తరలవారు కూడా తెలుసుకునేలా పదవ తరగతి సిలబస్ లో పాఠంగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో రానున్న కొత్త పాఠ్య పుస్తకాల్లోని ఆంగ్ల పుస్తకంలో యూనిట్-4 కింద 'ఫిల్మ్ అండ్ థియేటర్' పేరుతో 'మాయా బజార్' సినిమా గురించి సచిత్రంగా పాఠాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాతో బాటుగా శ్రీ 420, వందేళ్ల సినీ చరిత్ర గురించి కూడా క్లుప్తంగా వివరిస్తున్నారు.