భారత మహిళకు 'అంతర్జాతీయ ధీర వనిత' అవార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత మహిళకు 'అంతర్జాతీయ ధీర వనిత' అవార్డు

భారతీయ మహిళ, యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మికి ప్రతిష్ఠాత్మకమైన అమెరికా ప్రభుత్వ 'అంతర్జాతీయ ధీర వనిత' అవార్డు దక్కింది. విదేశాంగశాఖ వాషింగ్టన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆ దేశ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా ఈ అవార్డును ప్రదానం చేశారు. 16 ఏళ్ల వయసులో లక్ష్మి ఢిల్లీ బస్ స్టాప్ వద్ద ఉండగా ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. లక్ష్మి సోదరుడికి స్నేహితుడైన వ్యక్తే, తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఈ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి అలుపెరగని పోరాటం చేశారు.

More Telugu News