Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ తిరుమల పర్యటనపై నివేదిక కోరిన గవర్నర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఆదివారం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయన అనుచరులు హడావిడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ టీటీడీ అధికారులను నివేదిక కోరారు. గవర్నర్ ఆదేశాలతో టీటీడీ అధికారులు నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు.

More Telugu News