Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముషారఫ్ ను చంపుతామంటూ తాలిబన్ హెచ్చరికలు!

రేపు స్వదేశానికి తిరిగిరానున్న పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను హతమారుస్తామంటూ పాకిస్థాన్ తాలిబన్ బెదిరించింది. 'ముషారఫ్ పాక్ కు తిరిగి వస్తే ఇస్లాం ముజాహిద్దీన్ నరకానికి పంపడానికి ఆత్మహుతి బాంబర్లతో సిద్ధంగా ఉందని' శనివారం తాలిబన్ విడుదల చేసిన ఓ వీడియాలో హెచ్చరించారు.

అమెరికాపై జరిగిన 
సెప్టెంబర్ 11 దాడుల్లో టెర్రిస్టులతో కలిసి తాలిబన్లు, ఇతరులు పాల్గొనడంపై అప్పట్లో ముషారఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాక్ లో తీవ్రవాదాన్ని అణచివేసే దిశగా చర్యలు చేపట్టారు. కాగా, మే 11న పాక్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో... తన పార్టీ 'ఆల్ పాకిస్థాన్ ముస్లీం లీగ్' ను సిద్ధం చేసేందుకు స్వదేశానికి తిరిగివస్తున్నట్లు ఆయన గతనెలలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో పలు కేసులు ఎదుర్కొంటున్న ముషారఫ్ 
శుక్రవారం కరాచీ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. 2008 లో పాక్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న 69 సంవత్సరాల మాజీ అధ్యక్షుడు 2009లో స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు. అప్పటినుంచి దుబాయ్ లో ఆయన ఉంటున్న సంగతి తెలిసిందే.

More Telugu News