కోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం.. బెయిల్ కోసం ఎదురుచూపులు
సడక్ బంద్ నేపధ్యంలో తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ సహా మరికొంత మందిని మొన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రస్తుతం మహబూబ్ నగర్ జైలులో ఉన్నారు. వీరిపై పలు కీలక సెక్షన్ల కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ తరుణంలో వీరికి బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
కాగా, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పీజీ సెంటర్లో ప్రొఫెసర్ గా ఉద్యోగంలో వున్నారు. అలాగే, తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ కూడా ప్రభుత్వ ఉద్యోగే. వీరిద్దరికీ బెయిల్ రావడం అత్యవసరం. ఎందుకంటే, ప్రభుత్వోద్యోగంలో ఉన్న వ్యక్తి 48 గంటలపాటు రిమాండులో ఉంటే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకే, తెలంగాణ వాదులతో పాటు అందరిచూపు కోదండరామ్, శ్రీనివాస గౌడ్ లకు బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిమీదే నెలకొంది. దీనిపై మరికొంత సేపట్లో ఆలంపూర్ కోర్టు తన తీర్పును వెలువరించనుంది.
తీర్సు వెలువడే తరుణంలో తమ నేతలకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య, మాజీ ఎంపీ కె.కేశవరావు తదితరులు కోర్టుకు చేరుకుంటున్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలనుంచీ పలువురు తెలంగాణ వాదులు కోర్టు ప్రాంగణం వద్దకు చేరుకోవటంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
More Telugu News
-
కివీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
-
ఇసుకనే పలకగా మార్చి.. అక్షరాలు నేర్పుతున్న కేరళ బామ్మ.. వైరల్ అవుతున్న 'ఆశాట్టి అమ్ముమ్మ' పాఠాలు!
-
‘ఇంగ్లండ్‌లోని ఓ చిన్న రెస్టారెంట్లో రాజీవ్ గాంధీతో..’ తొలి ‘ఎక్స్’ పోస్ట్‌లో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు!
-
ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుముట్టి తాకారు: నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన
-
కొత్త జీవితం ప్రారంభించేలోపే విషాదం.. అమెరికాలో తెలంగాణ యువతి హఠాన్మరణం
-
'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
సల్మాన్ ఖాన్‌ను పొగిడినందుకే టైగర్ ష్రాఫ్‌పై కాల్పులా? బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వాంగ్మూలంతో కొత్త కోణం!
-
'సీడెడ్', 'నైజాం' వద్దు.. 'రాయలసీమ', 'తెలంగాణ' అనండి: దర్శకుడు రాహుల్ సాంకృత్యన్
-
నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన భువీ
-
హాకింగ్ వంటి దిగ్గజాలకు దక్కిన పతకం.. తొలిసారి భారతీయుడికి!
-
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కొత్త కోణం.. వెలుగులోకి సంచలన విషయాలు
-
వైసీపీ నేత జక్కంపూడి రాజాపై కేసు నమోదు
-
'పీరియడ్స్ ఆగవు కదా'.. మహిళల సవాళ్లపై చర్చ రేకెత్తించిన పర్వతారోహకురాలి వీడియో!
-
ఆటగాడిగా వచ్చి.. ఇప్పుడు కోచ్‌గా.. ముంబై ఇండియన్స్ పగ్గాలు పొలార్డ్ చేతికి
-
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ హైకోర్టులో పిటిషన్