విజయ్ వెనుదిరిగాడు
ఢిల్లీ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో టీ విరామానంతరం 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ విజయ్ (57) అర్థసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. విజయ్ వికెట్ సిడిల్ కు దక్కింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా 114 పరుగులు వెనుకబడే ఉంది. ప్రస్తుతం క్రీజులో సచిన్ (21 బ్యాటింగ్) కు తోడుగా రహానే (0 బ్యాటింగ్) ఉన్నాడు. కాగా, రహానేకిది కెరీర్లో తొలి టెస్టు.