చైన్నైలో మ్యాచ్ లు నిర్వహించలేం: ఐపీఎల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైన్నైలో మ్యాచ్ లు నిర్వహించలేం: ఐపీఎల్

తమిళనాడులో శ్రీలంకకు వ్యతిరేకంగా రగులుతున్న ఆందోళనల ప్రభావం ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది. 10రోజులలో ఐపీఎల్ ఆరవ లీగ్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తమిళనాడులో ఉన్న పరిస్థితుల కారణంగా చెన్నైలో మ్యాచ్ లు నిర్వహించలేమని ఐపీఎల్ బీసీసీఐకు తెలియజేసింది. ఐపీఎల్ నిర్ణయంపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. 

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేయాలని, శ్రీలంకలో జరిగిన తమిళుల ఊచకోతలపై భారత్ గట్టిగా నిరసన వ్యక్తం చేయాలనే డిమాండ్లతో డీఎంకే కేంద్ర ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాలలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో అక్కడ మ్యాచ్ లు నిర్వహిస్తే ఆటగాళ్ల భద్రతకు ఆటంకాలు ఎదురవుతాయేమోననే భయం ఐపీఎల్ కు పట్టుకుంది. 

More Telugu News