చైన్నైలో మ్యాచ్ లు నిర్వహించలేం: ఐపీఎల్
తమిళనాడులో శ్రీలంకకు వ్యతిరేకంగా రగులుతున్న ఆందోళనల ప్రభావం ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది. 10రోజులలో ఐపీఎల్ ఆరవ లీగ్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తమిళనాడులో ఉన్న పరిస్థితుల కారణంగా చెన్నైలో మ్యాచ్ లు నిర్వహించలేమని ఐపీఎల్ బీసీసీఐకు తెలియజేసింది. ఐపీఎల్ నిర్ణయంపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేయాలని, శ్రీలంకలో జరిగిన తమిళుల ఊచకోతలపై భారత్ గట్టిగా నిరసన వ్యక్తం చేయాలనే డిమాండ్లతో డీఎంకే కేంద్ర ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాలలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో అక్కడ మ్యాచ్ లు నిర్వహిస్తే ఆటగాళ్ల భద్రతకు ఆటంకాలు ఎదురవుతాయేమోననే భయం ఐపీఎల్ కు పట్టుకుంది.
More Telugu News
-
3000 పుస్తకాలు, 141 ఐక్యూ.. ఐదేళ్లకే 'మెన్సా'లో చోటు దక్కించుకున్న భారత సంతతి బాలుడు!
-
సౌదీపై హౌతీల సరికొత్త అస్త్రం.. ఎప్స్టీన్ కేసుతో దాడి!
-
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
-
చరిత్ర సృష్టించిన డాక్టర్ రూత్... దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పీజీ వైద్యురాలిగా రికార్డ్!
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
-
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
దామరచర్లలో గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
-
జనాలతో కలవాలని ఉంటుంది.. కానీ నాకు ఆ స్కిల్స్ లేవు: అక్షయ్
-
మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!
-
అమెరికా వీసా టెన్షన్.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య
-
కొత్త ప్రాజెక్ట్‌పై ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి ఎమోషనల్ పోస్ట్!
-
నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
-
కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ