రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో 'గేమ్' నగరం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో 'గేమ్' నగరం

యానిమేషన్ రంగానికి రాష్ట్రంలో మంచి రోజులు రానున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదు నగరంలో 'గేమ్' (గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్) ను ప్రోత్సహించడానికి ఐటీ శాఖ ఓ పాలసీని రూపొందిస్తోంది. ఆధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో ఈ 'గేమ్' నగరాన్ని నెలకొల్పడంతో బాటు శిక్షణ నిచ్చే ఓ అకాడమీని కూడా  ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. నగరంలో యానిమేషన్ రంగం బాగా విస్తరిస్తున్నందున, ఎంతో మంది ఈ రంగంలో ఉపాథి పొందుతున్నందున దీనిని మరింతగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రాజక్టును చేబట్టింది. ఈ  'గేమ్' నగరంలో ఎటువంటి ప్రాజక్టు పూర్తి చేసుకోవడానికైనా అన్ని వసతులూ వుంటాయి.                     

More Telugu News