తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయం: ప్రధాని మన్మోహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయం: ప్రధాని మన్మోహన్

15వ పార్లమెంటు సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల ముగింపు సందర్భంగా లోక్ సభలో ప్రధాని మన్మోహన్, స్పీకర్ మీరా కుమార్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయమని మన్మోహన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా ఈ దేశం నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించిందని ఆయన అన్నారు. తమ పనితీరును నిర్ణయించేందుకు ప్రజలకు ఓ అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. సభాపతికి, మిగతా సభ్యులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

లోక్ సభలో తొలి మహిళా సభాపతిగా తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు స్పీకర్ మీరాకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే లోక్ సభలో మరింత మంది మహిళా ఎంపీలు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ స్పందించిన తీరును మీరాకుమార్ గుర్తుచేసుకున్నారు. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని విపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు.

More Telugu News