దేశవ్యాప్తంగా... కొత్తగా రెండు కోట్ల మంది యువ ఓటర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశవ్యాప్తంగా... కొత్తగా రెండు కోట్ల మంది యువ ఓటర్లు

దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకున్న వారిలో.. రెండు కోట్ల మంది 18-19 ఏళ్ల మధ్యవారేనని ఎన్నికల కమిషన్ పేర్కొంది. భారత్ లో మొత్తం 81 కోట్ల 46 లక్షల మంది ఓటర్లుండగా.. వాళ్లలో 2.31 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల లోపు వారేనని తెలిపింది. అంటే దాదాపు దేశంలోని మొత్తం ఓటర్లలో 3 శాతం మంది యువత సరికొత్త ఓటర్లేనన్నమాట. మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని బట్టి ఈ వివరాలను ఈసీ వెల్లడించింది.

దేశంలో, అన్నింటి కంటే దాద్రానగర్ హవేలీలో అత్యధికంగా యువ ఓటర్లున్నారు. అక్కడ 9.80 శాతం మంది ఓటర్లు యువతీ యువకులే. తర్వాతి స్థానంలో 9.03 శాతంతో జార్ఖండ్ నిలిచింది. ఇక, అన్నింటి కంటే తక్కువగా అండమాన్ నికోబార్ దీవుల్లో 1.1 శాతం మంది యువ ఓటర్లున్నారు.

More Telugu News