జాతీయపార్టీగా అవతరించనున్న తెలుగుదేశం
టి. టీడీపీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. ఈ భేటీలో టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 22న తెలంగాణ జిల్లాల అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. ఈ విషయాన్ని చంద్రబాబు టి. టీడీపీ నేతలకు సూచనప్రాయంగా తెలియజేశారు. టి. టీడీపీ అధ్యక్షుడిని నియమించే ఆలోచనలో ఆయన ఉన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు ఉండాలని టి. టీడీపీ నేతలు నిర్ణయించారు.