హెచ్1బి వీసాల పంట.. గ్రీన్ కార్డ్ పౌరసత్వం
అమెరికా కలలు కనే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు శుభవార్త. వీరికి అనుకూలించే పలు నిబంధనలను అమెరికా సేనేటర్లు అక్కడి కాంగ్రెస్ కు ప్రతిపాదించారు. ఇవి ఆమోదం పొందితే విదేశీ విద్యార్థులకు ముందుగా జారీ చేయాలనుకున్న హెచ్1బి వీసాలు రెట్టింపు అవుతాయి. అంటే 65వేల వీసాలు కాస్తా 1,30,000కు పెరుగుతాయి. అలాగే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ తదితర కోర్సులను అమెరికాలో చదివిన వారు అక్కడే ఉండాలనుకుంటే వారికి గ్రీన్ కార్డ్ హోల్డర్ పౌరసత్వం లభిస్తుంది.
అమెరికా యూనివర్సిటీలో ఏటా లక్ష మంది వరకూ ప్రవేశాలు పొందుతున్నారు. సెనేటర్ల నూతన ప్రతిపాదనలు కచ్చితంగా మనవారికి ప్రయోజనం కల్పించేవే. వృత్తి నిపుణుల కొరతను తీర్చేందుకే ఈ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇవి ఆమోదం పొందితే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎమ్ సంస్థలకు నిపుణుల కొరత తీరుతుంది.
అమెరికాలోని విశ్వవిద్యాలయాలు సైన్స్, ఇంజనీరింగ్ డిగ్రీలలో సరిపడా నిపుణులను తయారు చేయలేకపోతున్నాయని అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ మార్కెట్ లో అమెరికా కంపెనీలు పోటీని కొనసాగించాలంటే అధిక నైపుణ్యం కలిగిన పనివారిని భర్తీ చేసుకోవాల్సి ఉందని, స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులు తిరిగి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్, యాహూకు చందిన మరిస్సా మేయర్ ఇలా ఉన్నతస్థాయి కంపెనీల సీఈఓలు గతవారం అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశారు. దీంతో కొత్త ప్రతిపాదనలు రూపొందాయి.

More Telugu News
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు
-
రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు
-
రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 126 పాయింట్లు డౌన్
-
మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని.. వీడియో ఇదిగో!
-
బీఎస్ఎన్ఎల్లో రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్.. 25కు పైగా ఓటీటీలు!