విప్ ధిక్కరించారు.. వేటుకు సిద్ధమయ్యారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విప్ ధిక్కరించారు.. వేటుకు సిద్ధమయ్యారు!

అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించి మరీ మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించిన కాంగ్రెస్ నేతలు ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంది. కాగా, సీఎల్పీ తీర్మానాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ కు పీసీసీ చీఫ్ బొత్స వివరించారు. ఆజాద్ కూడా వీరిపై వేటుకే మొగ్గు చూపినట్టు సమాచారం. 

More Telugu News