సంజయ్ దత్ కు శిక్ష.. షాక్ లో బాలీవుడ్
సినీ నటుడు సంజయ్ దత్ కు ముంబయి పేలుళ్ళ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష పడడంతో బాలీవుడ్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. పలువురు దర్శకులు, నిర్మాతలు, సహనటులు సంజయ్ దత్ కు సానుభూతి తెలిపారు. దర్శక దిగ్గజం మహేష్ బట్ ట్విట్టర్లో స్పందిస్తూ, 'నా గుండె పగిలింది, అతనిపై దయ చూపుతారనుకున్నా.అతనికి ఐదేళ్ళ శిక్ష పడిందన్న వార్త ఇప్పుడే విన్నా. ఏమైనా ఇలా జరగ్గూడదు భగవంతుడా' అని ట్వీట్ చేశాడు.
ఇక దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ట్విట్టర్లో ప్రతిస్పందించాడు. సంజయ్ దత్ శిక్షకు అర్హుడు కాదని పేర్కొన్నాడు. తనకు పరిచయమున్న వాళ్లలో సంజూ చాలా మంచివాడని కితాబిచ్చాడు. ఇక షెర్లిన్ చోప్రా 'విచారకరమైన వార్త' అని అభిప్రాయం వ్యక్తం చేసింది.