బొత్స నివాసంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ.. సీఎం సమావేశానికి పోటీగానేనా..?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బొత్స నివాసంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ.. సీఎం సమావేశానికి పోటీగానేనా..?

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రులు సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి, కన్నా, రఘువీరారెడ్డి, బాలరాజు, ఎమ్మెల్యేలు కమల, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటికి హాజరైన వారందరూ సీఎం వ్యతిరేక వర్గంగా ముద్రపడిన వారే. నిన్న సీఎం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన భేటీకి పోటీగానే బొత్స నివాసంలో వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది. కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నట్టు వస్తున్న వార్తలపై వారు చర్చించనున్నారు.

More Telugu News