కుక్క మొరిగిందని చాలా ఫీలయ్యాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుక్క మొరిగిందని చాలా ఫీలయ్యాడు!

ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ పట్టణంలో 'లోని' అనే ఒక ప్రాంతం. ప్రమోద్, సునీల్ పక్క, పక్క ఇళ్లలో ఉంటారు. ఇద్దరూ వారి వారి పెంపుడు కుక్కలతో గురువారం ఉదయం బయటకు వచ్చారు. వారు మాటల్లో మునిగిపోయేసరికి.. వారి పెంపుడు శునకాలు ఫైటింగ్ కు దిగాయి. యజమానులు ఇద్దరు నానా తంటాలు పడి వాటిని విడదీసి ఇంటికి బయల్దేరారు. కుక్కలను అదిలించేటప్పుడు సునీల్ పెంపుడు శునకం 'కల్లు'.. ప్రమోద్ ను చూసి కోపంతో మొరిగింది. దాంతో అతడు చాలా ఫీలయ్యాడు. ఏం మాట్లాడకుండా తన కుక్కతో ఇంటికి చేరుకున్నాడు.

లైసెన్స్ ఉన్న రివాల్వర్ ను బయటకు తీశాడు. పక్కింటి సునీల్ ఇంటికి వెళ్లి కల్లును కాల్చిపారేశాడు. మూడు బుల్లెట్లు దిగేసరికి అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ప్రమోద్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేకాదు, ప్రమోద్ కు తోడుగా వెళ్లిన అతడి తండ్రి, సోదరులపై కూడా ఇదే కేసు నమోదు చేశారు. కుక్క మొరిగితే ఇంత సీనా?

More Telugu News