నాటి యువరాణి దుస్తుల పట్ల 'వేలం' వెర్రి
బ్రిటన్ యువరాణి
ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదంలో మరణించి ఏళ్లు గడుస్తున్నా, ఆమె
ప్రాచుర్యం మాత్రం ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనమే ఈ సంఘటన. ఈ అందాల యువరాణి
ధరించిన అపురూపమైన దుస్తులు నిన్న లండన్ లో నిర్వహించిన వేలం పాటలో కోట్లు
పలికాయి. అప్పట్లో తన అమెరికా పర్యటనలో అధ్యక్షభవనం వైట్ హౌస్ లో జరిగిన ఓ
విందు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె ధరించిన గౌను అత్యధికర ధర
పలికింది.
ఈ కార్యక్రమంలో డయానా ఆ గౌను ధరించి, హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టాతో కలిసి నృత్యం చేసింది. అలాగే, 1992లో భారత పర్యటన సందర్భంగా ఆమె ధరించిన గులాబీరంగు గౌను కూడా అధిక మొత్తాన్ని ఆర్జించి పెట్టింది. ఈ వేలం పాట ద్వారా 71 కోట్ల రూపాయల వరకు వసూలైంది. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.