ఏం చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం: స్పీకర్ మీరాకుమార్
ఈ రోజు పార్లమెంటులో జరిగిన ఘటనలు సిగ్గుచేటని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థపై అత్యంత గౌరవం ఉందని... ఈ రోజు జరిగిన ఘటన వ్యవస్థకు మాయని మచ్చ అని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై చర్చిస్తామని చెప్పారు.