చంద్రబాబుతో టీడీపీ ఎంపీల భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ప్రతిరోజు ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బిల్లును అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దానిపై పార్టీ అధినేతతో టీడీపీ ఎంపీలు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.