కరీనాకపూర్ చెబుతున్న అందాల రహస్యాలు
'నేను అందం కోసం ప్రత్యేకంగా ఎలాంటి పద్ధతులు పాటించను. అదే సమయంలో ఎలాంటి రసాయనాలనూ అందం కోసం ముఖంపై వాడను. కాకపోతే నాది పొడిచర్మం. కనుక మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాస్తా. నా శిరోజాలకు రోజూ నూనె పెట్టడానికి ప్రయత్నిస్తా. దానివల్ల చక్కగా ఉండడమే కాదు. ఒత్తిడి తగ్గుతుంది. మంచి శిరోజాలను ఇష్టపడని వారు ఉండరు కదా. ఇక స్టైల్ అన్నది వేసుకున్న డ్రెస్ తో వచ్చేది కాదు. వ్యక్తిత్వానికి సంబంధించినది. నాకు నచ్చింది తింటా. రోజూ వ్యాయామం చేస్తా'నంటూ కొన్ని వివరాలు చెప్పింది.