Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీసీఐ ఎస్ అంటే.. మన పేసర్లకు మెక్ గ్రాత్ శిక్షణ

బౌలింగ్ లో పస కోల్పోయిన భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఊపిరిలూదాలనుకుంటున్నాడు. అనుమతిస్తే భారత పేసర్లను పదునైన బౌలర్లుగా తీర్చిదిద్దుతానంటూ ఒక ప్రతిపాదనను బీసీసీఐకు అందించాడు. బీసీసీఐ ఓకే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం మెక్ గ్రాత్ చెన్నైలో ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. కొందరు బౌలర్లను ఎంపిక చేసి చైన్నైలోని తన అకాడమీకి పంపిస్తే తర్ఫీదు ఇచ్చి పంపుతానని తన ప్రతిపాదనలో మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.

More Telugu News