సమాచార హక్కు చట్టంపై శ్రీకాకుళం జిల్లాలో సమన్వయ కమిటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమాచార హక్కు చట్టంపై శ్రీకాకుళం జిల్లాలో సమన్వయ కమిటీ

సమాచార హక్కు చట్టంపై జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సంవత్సర కాల పరిమితితో పనిచేసే ఈ కమిటీలో సమాచార చట్టం కార్యకర్తలు జోస్యుల వసంత కుమార్, షణ్ముఖ రావులను కలెక్టర్ నియమించారు. ఇంతకు మునుపే నౌపాడకు చెందిన సురేష్ కుమార్ ను నియమించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడుగా ఉండే సమాచార హక్కు కమిటీకి జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రాష్ట్ర సమాచార కమిషనర్ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార చట్టాన్ని మరింత పటిష్టంగా అమలుచేయాలనే లక్ష్యంతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని జీ.వో. నెంబరు 1185 ద్వారా 2013 మార్చిలో ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ సంవత్సరంలో కనీసం రెండు సార్లు సమావేశమవుతుంది. ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం అమలు తీరును సమీక్షించి కమిటీ సభ్యులు జిల్లా యంత్రాంగానికి సూచనలు చేయాల్సి ఉంటుంది.

More Telugu News