వీఆర్వో అభ్యర్థులకు రఘువీరారెడ్డి సూచనలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వీఆర్వో అభ్యర్థులకు రఘువీరారెడ్డి సూచనలు

గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) ఉద్యోగాల కోసం పరీక్ష రాసే అభ్యర్థులకు మంత్రి రఘువీరారెడ్డి కొన్ని సూచనలు చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు అనుమతించరని ఆయన చెప్పారు. పరీక్షకు వచ్చే ప్రతి అభ్యర్థిని తనిఖీ చేస్తారని, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షకులుగా ఉంటారని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు తమ వెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని రఘువీరారెడ్డి కోరారు. ఓటర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బస్ పాస్, పాస్ పోర్టు లాంటి గుర్తింపు కార్డులు తీసుకొని పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని ఆయన సూచించారు.

More Telugu News