రాజ్యసభ బరిలోంచి తప్పుకున్న చైతన్యరాజు
రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన చైతన్యరాజు బరిలోంచి తప్పుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, చైతన్యరాజు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో చైతన్యరాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆదాల కూడా ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ అధిష్ఠానం రెబల్స్ పై గుర్రుగా ఉంది.