సీమాంధ్రుల సమస్యలను శాసనసభలో చర్చించలేదు: కిషన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీమాంధ్రుల సమస్యలను శాసనసభలో చర్చించలేదు: కిషన్ రెడ్డి

అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించటంలో సీమాంధ్ర నేతలు విఫలమయ్యారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రానున్న రోజుల్లో విభజన జరిగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇరు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే విభజనను చేయడం వీలవుతుందని ఆయన చెప్పారు.

More Telugu News