ఒక స్వర్ణ పతకం... ఒక గొప్ప క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై దాన్ని గెలుచుకున్నాడు. అలాంటి పతకాన్ని వేలం వేయగా అది కోట్లల్లో ధర పలికింది. 1936 నాటి ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఒక నీగ్రో క్రీడాకారుడు తాను పాల్గొన్న నాలుగు అంశాల్లోనూ విజయం సాధించి స్వర్ణపతకాలను గెలుచుకున్నాడు. అందులో ఒక పతకాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేయగా దాన్ని సుమారు తొమ్మిది కోట్ల రూపాయలను వెచ్చించి ఒక పెద్ద వ్యాపారవేత్త సొంతం చేసుకున్నాడు.

1036లో జరిగిన బెర్లిన్‌ ఒలంపిక్స్‌లో అమెరికాకు చెందిన జెస్సీ ఒవెన్స్‌ మొత్తం నాలుగు స్వర్ణపతకాలను (100మీ., 200మీ., 400మీ.రిలే, లాంగ్‌జంప్‌లో) సాధించాడు. ఈ క్రీడలకు ఆనాటి నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ హాజరయ్యారు. ఒవెన్స్‌ తనకు వచ్చిన నాలుగు స్వర్ణ పతకాల్లో ఒకదాన్ని తనకు సాయం చేసిన తన స్నేహితుడికి కృతజ్ఞతగా ఇచ్చాడు. మిగిలిన మూడు స్వర్ణపతకాలు ఏమయ్యాయో ఒవెన్స్‌ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. కాగా తన స్నేహితుడికి కానుకగా ఇచ్చిన స్వర్ణ పతకాన్ని ఎస్‌సీపీ సంస్థ ఆదివారం నాడు ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచగా అమెరికాకు చెందిన బిజినెస్‌ మాగ్నెట్‌ రాన్‌ బర్కెల్‌ దీన్ని 1.4 మిలియన్‌ డాలర్లు (రూపాయల్లో 8.96 కోట్లు)కు కొనుగోలు చేసినట్టు సంస్థ వెల్లడించింది.