టీ అమ్మే వ్యక్తి కూడా ప్రధాని కావొచ్చు: దిగ్విజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ అమ్మే వ్యక్తి కూడా ప్రధాని కావొచ్చు: దిగ్విజయ్

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఊహించని విధంగా విభిన్న వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య తన మూఢ విశ్వాసాలకు గుజరాత్ ముఖ్యమంత్రి దూరంగా ఉంటున్నారన్న డిగ్గీరాజా ఆ వెంటనే.. టీ అమ్మే వ్యక్తి కూడా దేశానికి ప్రధానమంత్రి కావొచ్చని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అటల్ బిహారీ వాజ్ పేయి సిద్ధాంతాలను మోడీ అనుసరిస్తుండటం స్వాగతించదగ్గ పరిణామమని దిగ్విజయ్ పేర్కొన్నారు. దాంతో, తమ ప్రధాని అభ్యర్థిని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ వెంటనే స్వాగతించింది. అయితే, మోడీని భారత ప్రజలు అంగీకరించరన్న దిగ్విజయ్ ఒకవేళ దేవుడి దయవల్ల బీజేపీ అధికారంలోకి వస్తే సుష్మా స్వరాజ్ ను ప్రధానిగా ఎన్నుకోవాలని సూచించారు.

More Telugu News