యూటీ చేయడం వల్ల సీమాంధ్రకు ఉపయోగం లేదు: మంత్రి బాలరాజు
హైదరాబాద్ ను యూటీ చేయడం వల్ల సీమాంధ్రకు ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి బాలరాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాయల తెలంగాణ వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్రం తీసుకుంటున్న రాయల తెలంగాణ నిర్ణయం వల్ల రెండు ప్రాంతాల ప్రజలూ ఆనందంగా ఉండరని ఆయన అన్నారు.