Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోల్ కతా విశ్వవిద్యాలయంలో ఇకనుంచి ఉపాధ్యాయులకు విద్యార్థుల రేటింగ్!

సాధారణంగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులు రేటింగ్ ఇస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది! ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని బట్టి విద్యార్థులే వారికి రేటింగ్ ఇవ్వబోతున్నారు. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో ఈ నూతన విధానాన్ని తీసుకురాబోతున్నారు. వివరాల్లోకి వెళితే, ఈ నెల జరిగిన విశ్వవిద్యాలయం కౌన్సిల్ మీటింగ్ లో.. రాబోయే సెమిస్టర్ నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రెసిడెన్సీ వైస్ ఛాన్సెలర్ మలబికా సర్కార్ తెలిపారు.

సెమిస్టర్ పరీక్షల తర్వాత విద్యార్థులు వారి ఉపాధ్యాయుల పనితీరుపై ఫీడ్ బ్యాక్ ఇస్తారన్నారు. ఉఎాధ్యాయులు-విద్యార్థుల మధ్య సంబంధాన్ని మరింత పెంచేందుకే ఈ కొత్త ఆలోచనను తీసుకొస్తున్నామని, దానివల్ల విద్యార్థులు తరగతిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులతో చర్చిస్తారని వైస్ ఛాన్సెలర్ వివరించారు. అటు ఉపాధ్యాయుల టీచింగ్ విధానంలోనూ మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News