ఈ గౌను ధర కోటి
ఒక గౌను ధర ఎంతుంటుంది... మహా అయితే లక్షల్లో ఉంటుంది. కానీ ఒక గౌను ధర మాత్రం కోటి పలికింది. అంత స్పెషాలిటీ ఆ గౌనులో ఏం వుంది అనుకుంటే... అది ప్రిన్సెస్ డయానా ధరించిన గౌను. ఈ గౌనును డేవిడ్, ఎలిజబెత్ ఇమాన్యుయెల్ డిజైన్ చేశారు. మేలిమి ముత్యాలు, బంగారం ఉపయోగించి దీన్ని డిజైన్ చేశారు. ఈ గౌనును వేలం వేస్తే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కోటి రూపాయలు పలికింది. లండన్‌లోని కెర్రీ, టైలర్ సంస్థ ఈ గౌనును వేలం వేస్తే వేలంలో దీన్ని కోటి రూపాయలు పెట్టి అభిమానులు సొంతం చేసుకున్నారట.