భద్రతాదళాల కూంబింగ్ లో పదకొండు మంది తీవ్రవాదుల అరెస్ట్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో భద్రతాదళాలు నిర్వహించిన కూంబింగ్ లో పదకొండు మంది తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురిని ఇంపాల్ సరిహద్దులోని భారత్-మయన్మార్ సరిహద్దు దాటుతుండగా అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఉర్కల్ జిల్లాలోని అసంగ్ కులెన్ ప్రాంతంలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురిని, కంగ్లీపక్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఇద్దరు తీవ్రవాదులను, అలాగే కూకి నేషనల్ ఆర్మీకి చెందిన ఒక తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారన్నారు. వారి నుంచి ఎం16 రైఫిల్స్, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.