ఇబ్బందికర కాల్స్ పై పెనాల్టీ నిబంధనలు సడలించిన ట్రాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇబ్బందికర కాల్స్ పై పెనాల్టీ నిబంధనలు సడలించిన ట్రాయ్!

వినియోగదారులకు ఇబ్బంది కలిగించే రీతిలో ప్రమోషన్ కాల్స్ చేసే టెలికాం కంపెనీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు తమ నెట్ వర్క్స్ నుంచి ఇబ్బందికర కాల్స్, ఎస్ఎమ్ఎస్ లకు సంబంధించి, వారానికి యాభై వరకు ఫిర్యాదులకు గానూ ఐదువేల రూపాయలు పెనాల్టీగా చెల్లిస్తున్నాయి. దీనినుంచి ఇప్పుడు ట్రాయ్ కొంత ఉపశమనాన్నిస్తూ ఫిర్యాదుల సంఖ్యను పెంచింది. ఇప్పుడు వారానికి యాభై ఫిర్యాదులు వరకు వస్తే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. అంతకుమించి.. అంటే మూడు వందలకు పైగా కాల్స్ వస్తే ఒక్కో ఫిర్యాదుకు వెయ్యి రూపాయలు చెల్లించాలని నిబంధనలు మార్చింది. అదే ఫిర్యాదులు 300 నుంచి 700 వరకు ఉంటే రెండువేలు చెల్లించాలని పేర్కొంది.

More Telugu News