Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 1.75 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాడి అరెస్టు

వేద ఆగ్రోఫామ్స్ డెవలపర్స్ పేరిట విశాఖపట్టణంలో రూ. 1.75 కోట్లు వసూలు చేసి, కుచ్చుటోపీ పెట్టి పరారైన కేటుగాడ్ని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 35 లక్షల రూపాయల విలువైన భూముల పత్రాలు, బంగారం, ల్యాప్ ట్యాప్ లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరో ఘటనలో, సెప్టెంబర్ లో విశాఖలోనే జరిగిన ఓ నగల దుకాణం దోపిడీ కేసులో, నిందితుడ్ని ముంబైలో విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వారు వెల్లడించారు.

More Telugu News