ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా
ఈ ఉదయం నుంచి జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్ లో సోనియాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఓటు వేశారు. అటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా లోధి ఎస్టేట్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ముఖ్యనేత మనీష్ సిసోడియాలు తమ నియోజక వర్గాల్లో ఓటు వేశారు. పదకొండు గంటల వరకు 17 శాతం ఓటింగ్ నమోదైంది.