భాగ్యనగర వీధుల్లో యాచకురాలిగా మారిన విద్యాబాలన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భాగ్యనగర వీధుల్లో యాచకురాలిగా మారిన విద్యాబాలన్

విద్యాబాలన్.. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే అద్భుతమైన నటీమణి. తన నిజజీవితంలో అచ్చమైన భారతనారిలా ఉండే విద్య.. సినిమాల విషయంలోకి వచ్చేసరికి మాత్రం పాత్ర ఎలా ఉంటే అలా మారిపోతుంది. కానీ అలాంటి విద్యాబాలన్.. భాగ్యనగర వీధుల్లో యాచించడమేమిటని అనుకుంటున్నారా...? అవును మీరు చదువుతున్నది నిజమే.

బాలీవుడ్ నటి విద్యాబాలన్ భాగ్యనగర వీధుల్లో భిక్షాటన చేస్తోంది. తాజాగా తాను నటిస్తున్న 'బాబీ జాసూస్' అనే సినిమా కోసం ఆమె ఈ కొత్త వేషంలో కనిపించనుంది. హైదరాబాద్ లోని ఓ రైల్వే స్టేషన్ ముందు భిక్షగత్తె వేషం వేసుకుని డబ్బులు అడుక్కునే అమ్మాయిలా కనిపించింది. బోర్న్ ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు దియా మీర్జా, సాహిల్ సంఘా. ఈ సినిమా 2014 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.

More Telugu News